23 June, 2026 | 1:37 AM

ఫీజుల దోపిడీని అరికట్టాలి

23-06-2026 12:37 AM
  1. ప్రభుత్వ స్కూళ్లను ఎత్తివేస్తే ఊరుకోం
  2. ఏఐఎస్‌ఎఫ్ విద్యాశాఖ కార్యాలయం ముట్టడి 
  3. అరెస్ట్, పోలీసుస్టేషన్‌కు తరలింపు

హైదరాబాద్, జూన్ 22 (విజయక్రాంతి) : పాఠశాల విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, ప్రైవేట్ పాఠశాల ల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని ఏఐఎస్‌ఎఫ్ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవా రం పాఠశాల విద్యాశాఖ కార్యాలయం ఎదు ట ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కసిరెడ్డి మణికంఠరెడ్డి, పుట్ట లక్ష్మణ్ మాట్లాడు తూ రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు అక్షరాలతో వ్యాపారం చేస్తున్నాయని మండిపడ్డారు.

ఎల్‌కేజీ విద్యకు లక్ష నుంచి నాలుగు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాయని, ఇవే కాకుండా పుస్తకాలు, యూని ఫామ్, ఐడీ కార్డ్, డైరీలు, అడ్మిషన్ పేరిత మరో లక్ష రూపాయలు తీసుకుంటున్నాయని పేర్కొన్నారు. విద్యాశాఖ అధికారులు ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లకు వత్తాసు పలుకుతూ నోరు మెదపడం లేదని ఆరోపిం చారు.  సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఒక ఛాన ల్ ఇంటర్వ్యూలో 27 వేల ప్రభుత్వ పాఠశాలలను 4 వేలకు కుదిస్తామని మాట్లాడటం ప్రభుత్వ విద్య నిర్వీర్యం చేసే కుట్రలో భాగమేనన్నారు. 

రేషనలైజేషన్ పేరుతో ప్రభుత్వ స్కూళ్లను ఎత్తివేసే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలలో పేదలకు 25 శాతం సీట్లు ఉచితంగా ఇవ్వాలని కోరారు.  కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ఆఫీస్ బేరర్లు గ్యార నరేష్, బానోత్ రఘురాం, రెహమాన్, లెనిన్, రాష్ట్ర నాయకులు చైతన్య యాదవ్, అన్వర్, శాంతి కుమా ర్, దత్తురెడ్డి, ఆకాష్ నాయక్, హరీష్ , అనిల్, అరుణ్, జోసెఫ్ భాను, అవినాష్, లోకేష్, నవీన్, విజయ్, శ్రీను, రాహుల్, లింగం, అస్లాం తదితరులు పాల్గొన్నారు.