10 June, 2026 | 1:23 AM

సహజ కాన్పులపై అవగాహన

10-06-2026 12:42 AM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), జూన్ 9: గర్భిణీలు క్రమం తప్పకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షల నిర్వహించుకుని ఉచితంగా మందులు తీసుకోవాలని మండల వైద్యాధికారి డాక్టర్ భూక్యా నగేష్ నాయక్ కోరారు.మండల కేంద్రం అర్వపల్లిలోని పీహెచ్సీ లో మంగళవారం సహజ కాన్పులకై గర్భిణీలకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణీలు ఉదయం,సాయంత్రం వేళల్లో ఆరోగ్య సిబ్బంది,ఆశా కార్యకర్తలు సూచించిన విధంగా వ్యాయామం చేసినట్లయితే సహజ కాన్పు అవుతారని చెప్పారు.సహజ కాన్పుల వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని,అదే ఆపరేషన్ అయినట్లయితే అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో సీహెచ్‌ఓ బిచ్చునాయక్,ట్రైనీ డాక్టర్ కావ్య,హెల్త్ సూపర్వైజర్ లలిత, నర్సింగ్ ఆఫీసర్లు సునీత, మాధవి, వీరయ్య, అనూష, ఆశాలు, గర్భిణీలు తదితరులు పాల్గొన్నారు.