calender_icon.png 28 June, 2025 | 9:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేయూత పెన్షన్లపై అధికారులకు అవగాహన సదస్స

28-06-2025 12:00:00 AM

వనపర్తి టౌన్, జూన్ 27 : ప్రభుత్వం ద్వారా అందిస్తున్న చేయూత పింఛన్లు ప్రామాణికం లేకుండా కేవలం బొటన వేలు సంతకంతో ఇవ్వరాదని దీని ద్వార కొన్ని సార్లు అవకతవకలు జరిగే ప్రమాదం ఉంటుందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.

గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో  చేయూత పింఛన్ల దరఖాస్తులు ఎలా పరిష్కరించాలి, చేస్తున్న లోటుపాట్ల పై అవగాహన కల్పించేందుకు శుక్రవారం హైదరాబాద్ నుండి వచ్చిన అడిషనల్ డైరెక్టర్ గోపాల్ రావు కలెక్టరేట్ మీటింగ్ హల్లో ఎంపీడీఓ లు, మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ సెక్రెటరీలు వార్డు ఆఫీసర్లకు అవగాహన కల్పించారు.

ఈ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఒక్క వనపర్తి జిల్లాలో 73 వేల మంది లబ్ధిదారులకు రూ. 17 కోట్లు నెలకు చేయూత పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆసరా పింఛన్లు, బీడీ కార్మికులకు, దివ్యాంగులకు, ఒంటరి మహిళలకు తదితర పింఛన్లు ప్రతి నెల ఇవ్వడం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధి శాఖ అడిషనల్ డైరెక్టర్ గోపాలరావు, అదనపు కలెక్టర్ లోకల్ బాడీ ఇంచార్జ్ యాదయ్య, డిఆర్డిఓ పి.డి ఉమాదేవి, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ సెక్రటరీలు, వార్డు ఆఫీసర్లు, తదితరులు పాల్గొన్నారు.