శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం
తిరుమల తిరుపతి దేవస్థానంలో(Tirumala Tirupati Devasthanam) శనివారం భక్తుల రద్దీ కొనసాగుతుంది. తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి(Srivari Sarva Darshan) 20 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు ప్రకటించారు. సర్వదర్శనం కంపార్టుమెంట్లు నిండి నారాయణగిరి షెడ్ల వరకు భక్తులు వేచి ఉన్నారు. 68,229 మంది భక్తులు శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 30,559 మంది భక్తులు తిరుమల వెంకన్నకు తలనీలాలు సమర్పించారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.02 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు(TTD officials) పేర్కొన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కారణంగా ఈ సమయం పెరగవచ్చు లేదా తగ్గవచ్చని అధికారులు తెలిపారు. తిరుమలకు వెళ్లే భక్తులు ముందు టీటీడీ వెబ్‌సైట్ తాజా సమాచారాన్ని తెలుసుకోవడం మంచిదని తిరుమల దేవస్థానం ప్రకటించింది. రూ.300 ప్రత్యేక దర్శన టికెట్ తీసుకుంటే, 4 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.






