calender_icon.png 28 June, 2025 | 3:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీనియర్ జర్నలిస్ట్ ఆడెపు మహేందర్ మృతి

28-06-2025 12:00:00 AM

వరంగల్, జూన్ 27 (విజయ క్రాంతి): సీనియర్ జర్నలిస్ట్, హాన్స్ ఇండియా వరంగల్ బ్యూరో చీఫ్ ఆడెపు మహేందర్ (55) గుండెపోటుతో మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా, గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచారు. మహేందర్ మృతి పట్ల టియుడబ్ల్యూజే ఐజేయు నాయకులు తీవ్ర సంతాపం చేశారు. ఇటీవల వరంగల్ ఈనాడు బ్యూరో చీఫ్ దత్తు రెడ్డి మరణించగా, తాజాగా మహేందర్ మరణంతో వరంగల్‌లో విషాదం అలముకుంది.