4 April, 2026 | 2:46 AM

ఐటీడీఏ ద్వారా ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలుపై శిక్షణ కలెక్టర్లకు అవగాహన

04-04-2026 12:00 AM

భద్రాచలం, ఏప్రిల్ 3, (విజయక్రాంతి): గ్రూప్ వన్ శిక్షణ డిప్యూటీ కలెక్టర్లకు శిక్షణలో భాగంగా శుక్రవారం ఐటీడీఏ ద్వారా ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. ఎం ఎస్ ఎం ఈ గ్రూప్ యూనిట్ మహిళలు తయారు చేస్తున్న సబ్బులు ,షాంపూలు యూనిట్ పరిశీలించి, అనంతరం జిసిసి గోడౌన్ పరిశీలించారు.  ఆదివాసి గిరిజనుల నుండి సేకరిస్తున్న అటవీ ఉత్పత్తుల వివరాలు సబ్బులు, షాంపూలు తయారీ విధానము అడిగి తెలుసుకున్నారు.

అనంతరం భద్రగిరి మార్ట్ ను సందర్శించి, ఎస్ హె జి, ఎం ఎస్ ఎం ఈ యూనిట్ గిరిజన మహిళలు తయారుచేసిన ఇప్పపువ్వు లడ్డులు, మిల్లెట్ బిస్కెట్లు, ఆర్గానిక్ నిత్యవసర సరుకులు కొనుగోలు చేసి వారి మనసులోని భావాలను తెలియ చేసినట్లు ఐటీడీఏ పీవో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన అధికారి ఉదయ్ కుమార్, ఏవో సున్నం రాంబాబు, జేడీఎం హరికృష్ణ, భద్రగిరి మార్ట్ మేనేజర్ భార్గవి మరియు సిబ్బంది కళ్యాణ్, సాయి చంద్ తదితరులు పాల్గొన్నారు.