4 April, 2026 | 2:46 AM

డ్యూటీ ప్రదేశం వదిలి వెళ్లకూడదు

04-04-2026 12:00 AM

బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్

రామకృష్ణాపూర్, ఏప్రిల్ 3 : క్యాతనపల్లి మున్సిపాలిటిలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా పోలీసులకు కేటాయించిన డ్యూటీలు సక్రమంగా నిర్వర్తించాలని, కేటాయించిన డ్యూటీ ప్రదేశాన్ని వదిలి వెళ్లకూ డదని బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ పేర్కొన్నారు.

శుక్ర వారం సాయంత్రం రామకృ ష్ణాపూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో క్యాతనపల్లి మున్సిపాలిటి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సజావుగా నిర్వహించేందుకు ఏర్పా టు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నిక ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు తగిన భద్రతా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, పోలీసులకు సహకరించాలని కోరా రు.

ఎన్నిక సందర్భంగా శాంతి భద్రతలను కాపాడేందుకు బందోబస్తుకి నలుగురు ఏసీపీలు, 23 మంది సీఐ, ఎస్ ఐలు 46 మంది, ఏ ఎస్ ఐ, హెడ్ కానిస్టేబుల్ లు 98 మంది, పోలీస్ కానిస్టేబుళ్లు 167 మంది, మహిళా పోలీస్ సిబ్బంది 49 మంది, స్పెషల్ పార్టీ సిబ్బంది 38 మంది, హోం గారడ్స్ 60 మంది, మొత్తం 485 మంది పోలీసులతో పాటు నాలుగు టిజీ ఎస్ పి ఫ్లాటన్ లు విధుల్లో పాల్గొంటున్నాయని తెలిపారు.