14 July, 2026 | 4:49 AM

వసంత నగర్‌లో సర్‌పై అవగాహన శిబిరం

14-07-2026 12:04 AM

హెల్ప్ డెస్క్‌ను పర్యవేక్షించిన డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస బాబు

కూకట్ పల్లి, జులై 13,( విజయ క్రాంతి ):కూకట్ పల్లి నియోజకవర్గం వసంత్ నగర్ డివిజన్ లోని వసంత నగర్ సొసైటీ కార్యాలయం సమీపంలో సోమవారం ఓటర్లకు ఎస్‌ఐఆర్ ప్రక్రియ పై సహాయ శిబిరాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని వసంత డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కిలారు శ్రీనివాస బాబు పర్యవేక్షించారు. ఎన్యుమరేషన్ పత్రాల పంపిణీ, ఓటరు వివరాల నమోదును శ్రీనివాస బాబు స్వయంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా వసంత డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కిలారు శ్రీనివాస బాబు మాట్లాడుతూ డివిజన్ లో నివసిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి ఓటు నమోదు కావాలని, అదే సమయంలో స్థానికంగా కొంతకాలంగా లేని వారిని గుర్తించి, వారి ఓట్లను తొలగించాలని, ఎట్టి పరిస్థితుల్లో దొంగ ఓట్లు నమోదు చేయరాదని ఆయన బిఎల్‌ఓ లకు సూచించారు. ఓటర్ నమోదు ప్రక్రియలో పార్టీ కార్యకర్తలు చురుగ్గా పాల్గొనాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.