calender_icon.png 11 September, 2025 | 1:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవగాహనతోనే అడ్డుకట్ట

11-09-2025 10:31:21 AM

- డీఎంహెచ్ఓ డాక్టర్ అనిత

మంచిర్యాల,(విజయక్రాంతి): అవగాహనతోనే హెచ్ఐవీ, ఏయిడ్స్ వ్యాప్తికి అడ్డుకట్టవేయవచ్చునని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ అనిత అన్నారు. బుధ వారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, రాష్ట్ర ఏయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ లోని మీటింగ్ హాలులో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జిల్లా ఎయిడ్స్ నివారణ అధికారి డాక్టర్ సుధాకర్ నాయక్, జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్ లతో కలిసి మాట్లాడారు. హెచ్ఐవీ, ఏయిడ్స్, ఎస్టీఐ వ్యాప్తి, వ్యాధి నిర్మూలనకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అపోహలను గురించి వివరించారు.

హెచ్‌ఐవీ నిర్మూలనలో భాగంగా ట్రిపుల్ 95 లక్ష్య సాధనకు అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ ల బాధ్యతలు, చేయాల్సిన పనులనుద్దేశించి సూచనలు, మార్గదర్శకాలు చేశారు. అనంతరం హెచ్‌ఐవి, ఎయిడ్స్‌కు సంబంధించి ఆవగాహన కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సీడీపీవో మనోరమ, డెమో వెంకటేశ్వర్లు, సీహెచ్‌వో నామ్‌దేవ్, కె.వెంకటేశ్వర్లు, దిశ ప్రోగ్రామ్ మేనేజర్ నీలిమ, సర్వీసెస్ అధికారి రాజేష్, డీఎండీవో సంతోష్, క్షయ జిల్లా కోఆర్డినేటర్ సురేందర్, జిల్లా ఎపిడెమియాలజిస్ట్ సుమన్, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ స్నేహ, చేతన, ఎన్జీవో ప్రాజెక్ట్ మేనేజర్లు, జీఎన్ఎంలు, ఔట్రీచ్ కార్మికులు, లింకు సూపర్‌వైజర్ శ్రీకాంత్, సఖి సురక్షా కేంద్రం ప్రాజెక్ట్ మేనేజర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.