3 May, 2026 | 1:33 AM

సీజనల్ వ్యాధులపై ఆదర్శ పాఠశాలలో అవగాహన

04-07-2025 12:08 AM

నాగారం, జూలై 3 : మండల పరిధిలోని పసునూరు మోడల్ పాఠశాల యందు వర్ష కాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపై  డాక్టర్ నాగరాజు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో వర్షాలు పడడం వలన మన ఇంటి పరిసరాలలో నీరు నిల్వ ఉండడం, దోమలకు మంచి స్థావరాలుగా మారుతాయి అన్నారు. 

అవి కొట్టడం ఫలితంగా మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యాలు వ్యాధిగ్రస్తుల నుండి మరొకరికి  వ్యాప్తి చేస్తాయన్నారు. నీరు కలుషితం కావడం వలన, కలుషితమైన ఆహారం పదార్థాలు, ఈగలు వాలిన ఆహార పదార్థాలు తినడం వలన, టైఫాయిడ్,నీళ్ల విరేచనాలు, బంక విరేచనాలు, కలరా సంభవించే అవకాశాలు ఉంటాయన్నారు.

కావున వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని, వేడి ఆహార పదార్థాలు తీసుకోవాలని, నీళ్ళు కాచి వడబోసి త్రాగాలని అవగాహన కల్పించారు.  ఈ కార్యక్రమంలో జిల్లా ఎపిడమలజిస్ట్ డాక్టర్ సతీష్ గౌడ్, సామాజిక అరోగ్య అధికారి మాలోతు బిచ్చునాయక్, ప్రిన్సిపాల్ చంద్రబాబు నాయుడు, డాక్టర్ శ్రావణ్ కుమార్, సూపర్‌వైజర్ రామచంద్ర, లక్ష్మీ బాయి, సుమ, ఉపాద్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.