5 March, 2026 | 3:53 AM

జిల్లా వ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన

05-03-2026 02:29 AM

ఎస్పీ పరితోష్ పంకజ్

సంగారెడ్డి, మార్చి 4(విజయక్రాంతి): సైబర్ నేరాల నుండి విముక్తి కల్పించడానికి తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ ఏర్పాటు చేసిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో ద్వారా సైబర్ జాగురత దివాస్, ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్ పేరుతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూ.. ప్రజలను చైతన్య పరచడం జరుగుతుందని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు.

మార్చి నెల మొదటి బుధవారాన్ని దృష్టిలో ఉంచుకొని సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా సైబర్ జాగురత దివాస్ పేరుతో ఆన్లైన్ మోసాల గురించి అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీ ఎన్.వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జె.ఎన్.టి.యు ఇంజెనీరింగ్ కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు. సైబర్ నేరాలు అనేవి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఎదురుకుంటున్న సమస్య అని, సైబర్ నేరాల నుండి బయటపడాలంటే అవగాహన ముఖ్యం అన్నారు.

 ఈజీ మనికి అలవాటు పడి, అత్యాశకు పోయి సైబర్ నేరగాళ్లు పన్నిన వలలో పడవద్దని, ఈజీ మని అంటే మోసం అని గుర్తించాలని అన్నారు. అమాయక ప్రజల బలహీనతే, సైబర్ నేరాగాళ్ల బలంగా.. వివిధ రకాల సైబర్ మోసాలకు పాల్పడుతున్నారన్నారు. ఎవరై నా సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 కు కాల్ చేసి గాని, యన్.సి.ఆర్.బి పోర్టల్ నందు ఫిర్యాదు చేయాలని సూచించారు.