11-12-2025 08:24:32 PM
సిర్గాపూర్ (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో గురువారం గ్రామ పంచాయతీ ఎన్నికలపై అభ్యర్థులకు ఎన్నికల ప్రవర్తన నియమావళి, ఎన్నికల వ్యయంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల వ్యయం అసిస్టెంట్ అరుణ్ కులకర్ణి మాట్లాడుతూ... సర్పంచ్ అభ్యర్థులు రూ 1.50 లక్షలు, వార్డు సభ్యులు రూ. 30వేలు లోపు ఖర్చు చేయాలన్నారు. నిర్వాహణ ఖాత వివరాలను ఎన్నికలు ముగిసిన వెంటనే సమర్పించాలన్నారు. ఇందులో ఎంపీడీఓ, అధికారులు ఉన్నారు.