11-12-2025 09:01:53 PM
కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ రావు..
కరీంనగర్ (విజయక్రాంతి): తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బలపర్చిన అభ్యర్థులు సత్తా చాటారని ఆ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. తొలి దశ ఎన్నికల్లోనే 30 పైగా స్థానాల్లో గెలుపొందడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈనెల 14న జరగబోయే రెండో విడత, 17న జరగబోయే మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బలపర్చిన అభ్యర్థులే అత్యధిక స్థానాల్లో గెలుపొందడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఆయా అభ్యర్థులంతా పోలింగ్ జరిగే వరకు అప్రమత్తంగా ఉంటూ ప్రతి ఒక్క ఓటర్ ను కలిసి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ చొరవతోనే గ్రామాల అభివ్రుద్ధి సాధ్యమనే విషయాన్ని తెలియజేయాలని కోరారు.