11-12-2025 08:52:31 PM
పెరటి కోళ్లను పంపిణీ చేస్తున్న శాస్త్రవేత్తలు..
గరిడేపల్లి (విజయక్రాంతి): పేద మధ్యతరగతి రైతులు పెరటి కోళ్ల పెంపకంతో షెడ్యూల్ కులాలకు చెందిన రైతులు ఆర్థిక అభివృద్ధిని పొందవచ్చునని కె.వి.కె ఇంచార్జ్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ డి నరేష్ అన్నారు. మండలంలోని గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో ఐ సి ఏ ఆర్ అటారి హైదరాబాద్ వారి ఆర్థిక సహకారంతో షెడ్యూల్డ్ కులాల రైతులకు పెరటి కోళ్లను (రాజశ్రీ) గురువారం ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నిరుపేద రైతులకు పెరటి కోళ్ల పెంపకం ద్వారా ఆర్థిక అభివృద్ధి సాధించవచ్చు అన్నారు.
పెరటి కోళ్ల పెంపకంతో కుటుంబ సభ్యులకు రోజువారి ఆహారంలో మాంసకృతులు లభించడమే కాక పోషకాహార లోపాన్ని తగ్గించుకోవచ్చు అన్నారు. వీటి గుడ్ల ఉత్పత్తి,మాంసపు ఉత్పత్తిని సాధించడంతో పాటు పోషకాహారాన్ని పొందటమే గాక వాటిని అమ్మడం ద్వారా ఆర్థికంగా ఎదగవస్తున్నారు. కార్యక్రమంలో గృహ విజ్ఞాన శాస్త్రవేత్త ఎం సుగంది, శాస్త్రవేత్తలు సిహెచ్ నరేష్, మోతే మండలానికి చెందిన గ్రామ మహిళలు, 50 మంది రైతులు తదితరులు పాల్గొన్నారు.