calender_icon.png 11 December, 2025 | 10:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్ఎస్ అభ్యర్థులను ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించండి

11-12-2025 08:50:06 PM

* పల్లెల అభివృద్ధి బీఆర్ఎస్ తోనే సాధ్యం 

* అమలు కాని హామీలతో అధికార పార్టీ మోసపూరిత మాటలు నమ్మొద్దు 

* ఒంటెద్దు నరసింహారెడ్డి 

గరిడేపల్లి (విజయక్రాంతి): బీఆర్ఎస్ బలపరిచిన స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని హుజూర్నగర్ బీఆర్ఎస్ నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి కోరారు. గురువారం మండలంలోని కల్మలచెరువు, కీతవారిగూడెం గ్రామాల్లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ రైతు బీమా, రైతు బంధు, పింఛన్లు, కళ్యాణ్ లక్ష్మి వంటి అనేక పథకాలతో పల్లెలను అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం అమలు కాని హామీలతో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను గ్రామాలకు తీసుకెళ్లాలని ఆయన సూచించారు.

సిపిఎం బలపరిచిన బీఆర్ఎస్ అభ్యర్థులు బొల్లెపల్లి రామనాథం, కలమలచెరువులో బచ్చలకూరి శ్రీనును భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. కీతవారిగూడెంలో బ్యాట్ గుర్తు పోస్టర్, నమూనా బ్యాలెట్ను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకట్ రెడ్డి,సీనియర్ నాయకులు కేఎల్ఎన్ రెడ్డి,మాజీ వైస్ ఎంపీపీ గుత్తికొండ ప్రమీల వెంకటరమణారెడ్డి,మాజీ సర్పంచ్ కీత జ్యోతి రామారావు,సిపిఎం నాయకులు తుమ్మల సైదయ్య,సుందరి వీర రాఘవయ్య,బొల్లెపల్లి శ్రీనివాస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.