11-12-2025 08:56:13 PM
ఉప్పల్ (విజయక్రాంతి): ఉప్పల్ నియోజవర్గంలోని నాచారం డివిజన్ లోని నియోజవర్గంలోని 35 లక్షల వ్యయంతో నూతన సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులను ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి స్థానిక నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈఎస్ఐ హాస్పిటల్ ఎదురుగా రవీంద్రనగర్ లో చాలాకాలంగా చిన్న వర్షం వచ్చిన రోడ్డు పూర్తిగా జలమయమైపోతున్నదని కాలనీ వాసులు కార్పొరేటర్ శాంతి విజ్ఞప్తి చేయడంతో ఈ సమస్య పరిష్కరించడానికి 25 లక్షల రూపాయలు నూతన సిమెంట్ రోడ్డు అధికారులతో మాట్లాడటంతో నిధులు మంజురు కాగా పనులు ప్రారంభించారు.
అదేవిధంగా 10 లక్షల రూపాయల వ్యయంతో శ్రీ రాఘవేంద్ర నగర్ కాలనీ ప్రధాన ద్వారం సుమారు 100 మీటర్ల మేర రోడ్డు పూర్తిగా గుంతల మయం అవ్వడంతో కొత్త సిమెంట్ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఇంజనీర్ బాలకృష్ణ వర్క్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్, నాచారం డివిజన్ బారాస నాయకులు కార్యకర్తలు శ్రీ రాఘవేంద్ర నగర్ కాలనీ వాసులు కాంక్రీట్ పలాజోవాసులు, రవీంద్ర నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.