11-12-2025 08:43:58 PM
హైదరాబాద్: రాజన్న సిరిసిల్లా జిల్లా(Rajanna Sircilla District) వేములవాడలోని చింతల్ ఠాణా గ్రామంలో ఎన్నికల అధికారులకు కీలక పరిణామం ఎదురైంది. ఐదు రోజుల క్రితం గుండెపోటుతో చనిపోయిన సర్పంచ్ అభ్యర్థి చెర్ల మురళి(53)కి అధిక ఓట్లు నమోదయ్యాయి. దీంతో ఎన్నికల అధికారులు ఫలితం ప్రకటనపై తర్జనభర్జన పడుతున్నారు. ఆర్వో ఇంకా ఫలితం ప్రకటించకుండా ఉన్నతాధికారి ఆదేశం కోసం వేచి చూస్తున్నారు.