02-05-2025 12:00:00 AM
జిల్లా జడ్జి రాధిక
నిర్మల్, మే 1 (విజయక్రాంతి): భారత రాజ్యాంగంలో ప్రజలందరికీ కల్పించబడిన హక్కుల మాదిరిగానే కార్మికులకు కూడా కొన్ని హక్కులను కల్పిస్తూ కార్మిక చట్టాలను రూపొందించడం జరిగిందని జిల్లా జడ్జి రాధిక అన్నారు. గురువారం ప్రపంచ కార్మిక దినోత్సవం పురస్కరించుకుని భగత్‌సింగ్ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యారు. పీవోడబ్ల్యూ జిల్లా అధ్యక్షు రాలు లక్ష్మీ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించగా భారత రాజ్యాంగంలో కార్మిక చట్టాలు వాటి అమలు తదితర అంశాలపై జడ్జి కార్మికులకు అవగాహన కల్పించారు. కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తే న్యాయస్థానం ద్వారా న్యాయం పొందే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు రాజన్న లక్ష్మీగఫూర్ గంగామణి గంగాధర్ రేష్మ భీమక్క రాజు తెతలు పాల్గొన్నారు