02-05-2025 12:00:00 AM
ఎస్పీ జానకి షర్మిల
నిర్మల్ మే 1 (విజయక్రాంతి): జిల్లాలో పోలీసు విధులు నిర్వహించే ప్రతి ఒక్కరు సమయపాలన పాటించి నేరాల నియంత్రణకు కృషి చేయాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల సూచించారు. గురువారం జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయం నుండి వివిధ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఐ లు, సిఐలు సిబ్బందితో టెలికాన్ ప్లస్ నిర్వహించి సూచనలు సలహాలు చేశారు. దొం గతనాలను అరికట్టాలని డిజిటల్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థను అమలు చేయాలని బాధితులకు న్యాయం జరిగేటట్టు చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ ఉపేందర్ రెడ్డి పోలీసులు ఉన్నారు.