సురక్షిత ఇంటర్నెట్ వినియోగంపై అవగాహన
ఘట్‌కేసర్, ఆగస్టు 21 (విజయక్రాంతి) : అనురాగ్ యూనివర్సిటీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ఐఈఈఈ -ఎస్‌ఎస్‌ఐటి స్టూడెంట్ బ్రాంచ్ చాప్టర్ సహకారంతో డిజి రక్ష ఇంటరాక్టివ్ సైబర్ సేఫ్టీ సిమ్యులేషన్ కార్యక్రమాన్ని ఘట్ కేసర్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాలలోని 9, 10 తరగతుల విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థులకు సైబర్ భద్రత, ఆన్లైన్ మోసాలు, ఫిషింగ్, బలమైన పాస్వర్డ్ల వినియోగం, సోషల్ మీడియా భద్రత, వ్యక్తిగత సమాచార పరిరక్షణ, సురక్షితమైన ఇంటర్నెట్ వినియోగం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ప్రత్యేకంగా ఇంటరాక్టివ్ సైబర్ సేఫ్టీ సిమ్యులేషన్ ద్వారా విద్యార్థులకు సైబర్ ప్రమాదాలను గుర్తించడం, అనుమానాస్పద లింకులు, సందేశాలను నివారించడం, ఆన్ లైన్ లో బాధ్యతాయుతంగా వ్యవహరించడం వంటి అంశాలను ప్రాయోగికంగా వివరించారు.
విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని, వివిధ సైబర్ భద్రతా పరిస్థితులపై ప్రశ్నలు అడిగి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఐఈఈఈ-ఎస్‌ఎస్‌ఐటి స్టూడెంట్ చాప్టర్, అనురాగ్ యూనివర్సిటీ సభ్యులు బి. విష్ణు తేజ, డి. మృదుల, ఎన్. సాత్విక, పి. సాయి సృజన విద్యార్థులకు సైబర్ భద్రతపై అవగాహన కల్పించారు.
కార్యక్రమానికి అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫ్యాకల్టీ అడ్వైజర్ డాక్టర్ జి.ఎల్. ఆనంద్ బాబు మార్గదర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ జి. శేఖర్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొమ్మిరెడ్డి పాపిరెడ్డి, ఐఈఈఈ-ఎస్‌ఎస్‌ఐటి ఎగ్జిక్యూటివ్ మెంబర్ లు, విద్యార్థులు పాల్గొన్నారు.






