22 August, 2026 | 3:22 AM

ప్రిన్సిపాల్ రూపారెడ్డి చిత్ర పటానికి నివాళులు

22-08-2026 01:45 AM

రాజాపూర్ ఆగస్టు 21: నల్గొండ జిల్లాలో విద్యార్థుల చేతిలో అత్యకు గురైన ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్ రూప రెడ్డి చిత్ర పటానికి మండలంలోని ప్రవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు శుక్రవారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి ప్రయోజకులను చేసే ఉపాధ్యాయులపై దాడులు చేయడం హత్యలు చేయడం లాంటి ఘటనలు జరగడం చాలా బాధాకరమని అన్నారు.

పిల్లల తల్లిదండ్రులు పిల్లల పెంపకం విషయంలో జాగ్రత్తలు తీసుకొని వారికి సరైన క్రమశిక్షణ అలవాటు చేయాలని కోరారు. విద్యార్థులు ఏం చేస్తున్నారు నిత్యం పర్యవేక్షించాలని వారికి మంచి చెడులు చెప్పాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బాలరాజ్ సత్యనారాయణ, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.