నూతన ఎంఈవోగా వెంకట రాములు
22-08-2026 01:46 AM
మిడ్జిల్ ఆగస్టు 21 : మండల విద్యాశాఖాధికారిగా పోమాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట రాములు బాధ్యతలు స్వీకరించారు. ఎంపీడీఓ లక్ష్మణ్ రాథోడ్ చేతుల మీదుగా నియామక ఉత్తర్వులు అందుకున్నారు. ఈ సందర్భంగా టీఎస్జిహెచ్‌ఎంఎ జిల్లా అధ్యక్షుడు అనంతప్ప, ప్రధాన కార్యదర్శి జగదీష్ సుధాకర్ తదితర ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ఆయనను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపు, మౌలిక వసతుల కల్పన, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, ఉపాధ్యాయుల సహకారంతో మండలంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తానని వెంకట రాములు తెలిపారు.






