22 August, 2026 | 2:46 AM

వేంకటేశ్వరస్వామి సన్నిధిలో స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్

22-08-2026 12:00 AM

ఘట్‌కేసర్, ఆగస్టు 21 (విజయక్రాంతి) : పోచారం డివిజన్ పరిధిలోని వెంకటపురం లోని వెయ్యేళ్ల చరిత్ర కలిగిన శ్రీస్వయంభు బాలాజీ వెంకటేశ్వరస్వామి దేవస్థానాన్ని రా ష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజ య్య శుక్రవారం సందర్శించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించా రు. ఈసందర్భంగా దేవస్థానంలో నిర్వహించనున్న మహాకుంభాభిషేక కార్యక్రమానికి సంబంధించి జరుగుతున్న పూజా కార్యక్రమాలు, ఏర్పాట్లను పరిశీలించారు.

అనంతరం నూతన పాలక మండలి కమిటీ చైర్మన్ నీరుడి కుమార్ ని డాక్టర్ సిరిసిల్ల రాజయ్య అభినందించారు. దేవస్థానం యొక్క ప్రాచీన చరిత్ర, ఆధ్యాత్మిక విశిష్టతను తెలుసుకున్న డాక్టర్ సిరిసిల్ల రాజయ్య ఆలయ అభివృద్ధి కోసం జరుగుతున్న కార్యక్రమాలను కొనియాడారు.  మహాకుంభాభిషేక కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని ఆకాంక్షించారు.

ఈకార్యక్రమంలో ఆలయ నూతన పాలక మండలి సభ్యులు, సిహెచ్. కృష్ణ, రాయబండి అరుణ్ తేజ్, కాంగ్రెస్ పార్టీ పోచారం డివిజన్ అధ్యక్షులు కర్రె రాజేష్, జిల్లా ఉపాధ్యక్షులు ఇటికాల కృష్ణరెడ్డి, మాజీ అధ్యక్షులు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, గణేష్ యాదవ్, బద్దం నర్సింహ రెడ్డి, బద్దం మల్లికార్జున్ రెడ్డి, చింతపంటి సత్తయ్య, భోజి రెడ్డి, వినోద్ కుమార్, చంద్రకాంత్, వెంకటేష్, సంతోష్,ఆంజనేయులు గౌడ్, సురేష్, వేణు గోపాల్, నాగరాజు గౌడ్, రమేష్, లక్ష్మి, పావని, అందే పోచయ్య, బాలరాజ్ గౌడ్, నీరుడు సాయి పాల్గొన్నారు.