08-08-2025 01:21:05 AM
మహాదేవపూర్, (భూపాలపల్లి) జూలై 7 (విజయ క్రాంతి) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో తల్లిపాల గురించి గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు శిశు సమగ్ర అభివృద్ధి అధికారిని రాధిక అవగాహన కల్పించారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ముగింపు సమావేశంలో రాధిక మాట్లాడుతూ బిడ్డ పుట్టిన వెంటనే తల్లి పాలు (ముర్రుపాలు) పట్టించాలని బిడ్డకు రోగ నిరోధక శక్తి ఈ పాల వల్ల పెరుగుతుందని తెలిపారు.
ఈ ముర్రుపాలు ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రతి తల్లి తన డెలివరీ తర్వాత పాపకు, బాబుకు ఈ పాలను పట్టించడం వల్ల రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు పాలు తాగడంలో బిడ్డల కు అలవాటు చేసుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుకన్య, హెడ్ నర్స్ బాలమణి, సూపర్వైజర్లు నాగరాణి, భాగ్యలక్ష్మి, వీణ, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.