08-08-2025 01:20:30 AM
- వెయ్యి క్యూసెక్కుల ఇన్ ఫ్లో
- 339 క్యూసెక్కుల అవుట్ ఫ్లో
- ఒక గేటు ఎత్తి, దిగువకు నీటి విడుదల
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 7 (విజయక్రాంతి): కొన్ని రోజులుగా ఎగువ ప్రాంతా ల్లో కురుస్తున్న వర్షాలతో జంట జలాశయాలైన హిమాయత్‌సాగర్, ఉస్మాన్ సాగర్‌కు వరద నీరు వస్తోంది. దీంతో హిమాయత్ సాగర్ రిజర్వాయర్ ఒక గేట్‌ను గురువారం రాత్రి 10 గంటలకు జలమండలి అధికారులు ఎత్తారు. గేటును ఒక ఫీటు మేర ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం హిమాయ త్‌సాగర్‌కు 1000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగా 339 క్యూసెక్కుల అవుట్ ఫ్లో ఉంది.
పూర్తి స్థా యినీటి మట్టం 1763.50 అడుగులు కాగా ప్ర స్తుత నీటి మట్టం 1762.70 అడుగులు ఉంది. రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 2.970 టీఎంసీలు కాగా ప్రస్తుత సామర్థ్యం 2.734 టీఎం సీలుగా నమోదైంది. నీటిని దిగువకు విడుదల చేసినందున ఎండీ అశోక్‌రెడ్డి సంబంధిత జలమండలి అధికారులతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిపాలనా యంత్రాంగాలు, హైడ్రా, జీహెచ్‌ఎంసీ, పోలీసు అధికారులతో సమన్వయంతో వ్యవహరించాలన్నారు.
అప్రమత్తంగా ఉండండి: మంత్రి శ్రీధర్‌బాబు
ఉమ్మడి రంగారెడ్డి జిల్లావాసులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సంబంధిత ఉన్నతాధికారు లను జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆదేశించారు. గురువారం రాత్రి వర్షా భావ పరిస్థితులు, వరద సహాయక చర్యలపై ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని కలెక్టర్లు, జీహెచ్‌ఎంసీ, జలమండలి, టీజీఎస్పీడీసీఎల్, సైబరాబాద్, రాచకొండ పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షించారు. శేరిలింగంపల్లి, హైటెక్ సిటీ పరిసరాలు, సరూర్ నగర్, ఉప్పల్, షేక్ పేట్, కూకట్‌పల్లి, మల్కాజ్‌గిరి, నాగోల్, మూసీ నది పరివాహాక ప్రాంతాల్లో పరిస్థితిని అడిగి తెలుసుకుని మార్గనిర్దేశం చేశారు.