calender_icon.png 26 August, 2025 | 10:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళాల రక్షణ చట్టాలపై అవగాహన

26-08-2025 07:39:49 PM

కొండపాక: కొండపాక మోడల్ స్కూల్ విద్యార్థినీలకు మహిళల రక్షణ చట్టాలు, సైబర్ నేరాలు, గుడ్డు టచ్ _బ్యాడ్ టచ్, ఈవ్ టీజింగ్, గంజాయి, మత్తు పదార్థాలు పై కుకునూరుపల్లి ఎస్ ఐ శ్రీనివాస్ గజ్వేల్ షీ టీం బృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ లతీఫ్ మాట్లాడుతూ సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు మహిళల రక్షణ,పోక్ సో చట్టాలు, బాల్య వివాహాలు, సైబర్ సెక్యూరిటీ, సోషల్ మీడియా, మైనర్ డ్రైవింగ్ ప్రమాదాలు, డయల్ 100 ప్రాముఖ్యత, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ డిఫెన్స్ తదితర అంశాలపై విద్యార్థినిలకు అవగాహన కల్పించారు.

అపరిచితుల ఫోన్ కాల్స్, అనుమానస్పద వ్యక్తులు కనబడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. సైబర్ నేరస్తులు పంపించే లింకులు క్లిక్ చేయవద్దని, సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 సైబర్ సెల్ హెల్ప్ లైన్ కు సమాచారం ఇవ్వాలని హెచ్చరించారు. మహిళలు వేధింపులకు, గృహహించకు  గురైతే  వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చారు.అలాగే భరోసా సెంటర్, స్నేహిత మహిళా సెంటర్,లు అందించే సేవల గురించి వివరించారు. ఏదైనా సమస్యలు ఉంటే అత్యవసర నెంబర్లు, డయల్ 100, సిద్దిపేట షీ టీం 8712667434, స్నేహిత మహిళా సపోర్ట్ సెంటర్ 9494639498, సిద్దిపేట మహిళా పోలీస్ స్టేషన్ 8712667435 సూచించారు.