calender_icon.png 26 August, 2025 | 9:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూ భారతి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి

26-08-2025 07:37:12 PM

గద్వాల: భూ భారతి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని  జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆర్‌డీవో కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ భూ భారతికి సంబంధించిన ఫైళ్ళు, రిజిస్టర్లు, ఇతర రికార్డులను సవివరంగా పరిశీలించారు. అన్ని రికార్డులు సక్రమంగా ఉండాలని సూచించారు.

కార్యాలయానికి వచ్చిన ప్రజల సమస్యలను శ్రద్ధగా విని,ఆ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలన్నారు.రెవెన్యూ సదస్సులో ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని రెవిన్యూ అధికారులకు ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న భూభారతి సేవలు ప్రజలకు మరింత సులభంగా, ఉపయోగకరంగా ఉండేలా చూడాలని అన్నారు.