21-01-2026 12:00:00 AM
ఇన్ఫార్మల్ లేబర్ వెల్ఫేర్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఇనాయత్ అలీ బాక్రీ
ఇందిరా పార్కులో ఆటో డ్రైవర్ల ధర్నా
ముషీరాబాద్, జనవరి 20 (విజయక్రాంతి): కాంగ్రెస్ ఎన్నికల ముందు ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఇన్ఫా ర్మల్ లేబర్ వెల్ఫేర్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, సెట్విన్ మాజీ చైర్మన్ ఇనాయత్ అలీ బాక్రి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నగరంలో అనధికార ఇతర జిల్లాల ఆటోలపై ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ డ్రైవర్ లను ప్రారంభించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీ ప్రకారం మూడు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ప్రతి ఏడాది రూ. 12వేల చొప్పున రూ. 36 వేలను వెంటనే ఇవ్వాలని ఆటో డ్రైవర్లకు సంక్షేమ నిధి ఏర్పాటు చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఇందిరా పార్కు ధర్నా చౌక్లో ఇన్ఫార్మల్ లేబర్ వర్కర్స్ ఫెడరేషన్ డ్రైవర్ బంద్ ఆసోసియేషన్ చలో ఇందిరాపార్కు కార్యక్రమంలో భాగంగా వందలాది మంది ఆటో కార్మికులు ధర్నా కార్య క్రమాన్ని నిర్వహించారు.
ఈ ఆటో డ్రైవర్ల ధర్నాలో హైదరాబాద్ ఆధ్యక్షుడు ఆక్రమ్ ఖాన్, సైబరాబాద్ అధ్యక్షుడు షేక్ మాజీద్, ప్యూచర్ సిటీ అధ్యక్షుడు ఉస్మా న్ బిన్ ఆవాలే, రాచకొండ అధ్యకుడు జి. మల్లేష్, యూనియన్ నాయకులు మహ్మద్ ఖాజా, అబ్దుల్ రహీం, మహ్మద్ షకీల్, మహ్మద్ ఖరీమోద్దీన్, మహ్మద్ గౌస్, షేక్ మౌలానా, సైలాని, షేక్ అజహర్, మహ్మద్ ఇమ్రాన్ తో పాటు వందలాది మంది ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.