14 May, 2026 | 2:48 AM

పిల్లల భద్రతపై ఉపాధి కూలీలకు అవగాహన

14-05-2026 01:26 AM

చౌటుప్పల్, మే 13: ఈరోజు చౌటుప్పల్ మండలం అంకిరెడ్డి గూడెం గ్రామంలో షిటీమ్, బాలల పరిరక్షణ విభాగం, స్కోప్ సంస్థ  ఆధ్వర్యంలో బుధవారం ఉపాధిహామీ కూలీలకు పిల్లల భద్రతపై అవగాహన కార్యక్రమం  నిర్వహించారు. గ్రామంలో  బాల్యవివాహాలు చేయవద్దని 18 సంవత్సరాలు నిండిన తరవాత మాత్రమే వివాహం చేయాలని, పిల్లలు లేని వారు చట్ట బద్ధంగా మాత్రమే దత్తత తీసుకోవాలని  తెలిపారు.

పిల్లలు మొబైల్ ఫోన్ వాడకం తగ్గించాలని మైనర్ బాలికలను వేధించిన వారి పైన ఫోక్సో కేసు నమోదు చేయడం జరుగుతుంది అని మైనర్ డ్రైవింగ్, మరియు పిల్లలు గంజాయికి దూరంగా ఉండాలని అవగాహన కల్పించడం జరిగింది. పిల్లలు ఆపదలో ఉంటే  చైల్ హెల్ప్ లైన్ నెంబర్1098, 100,112  లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో షి టీమ్ నుండి (పోలీస్) రవీందర్ రెడ్డి, దుర్గ భవాని  బాలల పరిరక్షణ విభాగం నుండి యం. మత్స్యగిరి స్కోప్ సంస్థ నుండి నరసింహ రాజు పాల్గొన్నారు.