14-02-2026 12:00:00 AM
పంజాగుట్ట, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) లోని పల్మనరీ మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో శ్వాసకోశ వ్యాధుల నిర్వహణలో పురోగతి అనే అంశంపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వైద్య నిపుణులు పాల్గొని దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధి బాధితులకు అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక చికిత్సా పద్ధతులపై లోతైన చర్చ జరిపారు.
పల్మనరీ మెడిసిన్ విభాగాధిపతి ప్రొఫెసర్ నరేంద్ర కుమార్ మాట్లాడుతూ మన దేశంలో చాలామంది శ్వాసకోశ సమస్యలను ప్రాథమిక దశలో గుర్తించకపోవడం వల్ల వ్యాధి తీవ్రత పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సదస్సులో ఢిల్లీలోని గంగా రామ్ హాస్పిటల్, డాక్టర్ అమిత్ ధమీజా, యశోద, ఏఐజీ ఆసుపత్రుల నిపుణులు తదితరులు పాల్గొన్నారు.