15 April, 2026 | 1:18 PM

Breaking News

టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •  

డా. బిఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం

28-02-2026 09:30 PM

జడ్చర్ల: బూర్గుల రామకృష్ణ రావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో యువతలో ఆరోగ్యం, పోషకాహారం (హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఇన్ యూత్) అనే అంశంపై ప్రత్యేక అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా  మరియు ఏ ఐ విప్లవం మానవ మనుగడ (ఎఐ రేవోల్యూషన్ అండ్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్) అనే అంశం పైన పోస్టర్ ప్రజెంటేషన్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బాదెపల్లి ప్రభుత్వ ఆసుపత్రి గైనకాలజిస్ట్ డాక్టర్ తమ్మలి సౌజన్య మాట్లాడుతూ, ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో యువత తమ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించకూడదని సూచించారు.

ప్రస్తుత కాలంలో యువత ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా రక్తహీనత నివారణ, సమతుల్య ఆహారం మరియు వ్యాయామం యొక్క ప్రాముఖ్యతను ,జీవితంలో ప్రతి ఒక్కరూ యోగ సాధన చేయాలని ఆమె నొక్కి చెప్పారు.జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ నర్మదా మాట్లాడుతూ... సైన్స్ దైనందిన జీవితంలో ఎలా భాగమైందో, శాస్త్రీయ దృక్పథాన్ని అలవరుచుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని ఎలా నిర్మించవచ్చో చర్చించారు.

ఈ సందర్భంగా  ఏఐ విప్లవం - మానవ మనుగడ అంశంపై "పోస్టర్ ప్రజెంటేషన్" నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపాల్  ప్రొఫెసర్.జి. సుకన్య అభినందిస్తూ,విజేతలకు  బహుమతులను ప్రధానం చేయడం జరిగింది .ఈ కార్యక్రమంను సైన్స్ విభాగం వారు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధ్యాపకులు, సిబ్బంది మరియు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.