10 April, 2026 | 1:50 AM

ఎయిడ్స్ వ్యాధి నిర్మూలనకు అవగాహన కార్యక్రమం

10-04-2026 12:06 AM

గద్వాల టౌన్ ఏప్రిల్ 9ఎయిడ్స్ వ్యాధి ని ర్మూలనకు అవగాహన చాలా అవసరమని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. ఆరోగ్య వారోత్సవాల్లో భాగంగా గురువా రం గద్వాలలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఎయిడ్స్ హెచ్‌ఐవి వైరస్ వల్ల వస్తుం దని, అసురక్షిత లైంగిక సంబంధాలు,కలుషిత సూదులు,పరీక్షించని రక్త మార్పిడి ద్వా రా వ్యాపిస్తుందని చెప్పారు.

లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేయించుకోవాలని సూచిం చారు.ఏఆర్ టీ చికిత్సతో వైరస్ నియంత్రణ సాధ్యమని,ఆరోగ్యకర జీవనశైలిని పాటించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు,డిఎంహెచ్వో సంధ్య కిరణ్ మై,జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకులు ఇందిరా,ప్రోగ్రాం అధికారి రాజు,మరి యు వైద్య అధికారులు,డాక్టర్లు,వైద్య సిబ్బం ది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.