calender_icon.png 11 November, 2025 | 3:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భువనగిరిలో స్వచ్ఛతా హీ సేవపై అవగాహన ర్యాలీ

21-09-2024 03:43:57 PM

యాదాద్రి భువనగిరి, (విజయక్రాంతి): స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా శనివారం భువనగిరి పట్టణంలోని గాంధీ పార్కు నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, కమిషనర్ రామాంజుల రెడ్డి, లీడ్ బ్యాంకు మేనేజర్ కే. శివరామకృష్ణ పాల్గొని పట్టణ ప్రజలకు స్వచ్ఛతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద టైమ్స్ కళాశాల విద్యార్థిని, విద్యార్థులు, మహిళలు, పురపాలక అధికారులు, బ్యాంకు అధికారులు మానవహారం చేసి ప్రతిజ్ఞ చేశారు