11-11-2025 02:03:04 PM
కోల్‌కతా: ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం రాత్రి జరిగిన పేలుడుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాను తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా మంగళవారం విమర్శించారు. భారతదేశానికి అల్ టైం హేట్ క్యాంపెయిన్ మినిస్టర్ కాకుండా సమర్థవంతమైన హోంమంత్రి అవసరమని ఆమె విరుచుకుపడ్డారు. సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో మొయిత్రా ఇలా రాశారు. భారతదేశానికి పూర్తి సమయం ద్వేష ప్రచార మంత్రి కాదు, సమర్థవంతమైన హోం మంత్రి అవసరం. మన సరిహద్దులను అలాగే మన నగరాలను రక్షించడం అమిత్ షా విధి కాదా? అతను అన్ని విధాలుగా ఎందుకు విఫలమవుతున్నాడు? అని ప్రశ్నించారు. ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుడులో 12 మంది మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రులు చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో బాంబు ఘటనలో పోలీసింగ్, నిఘా అంతరాలపై పలు ప్రశ్నలను లేవనెత్తారు. కృష్ణానగర్ ఎంపీ శాంతిభద్రతలు, సమాఖ్యవాదం, ప్రతిపక్ష నాయకులపై కేంద్రం ఏజెన్సీలను ఉపయోగించడం వంటి అంశాలపై తరచుగా బీజేపీ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు.