11-11-2025 01:32:22 PM
హైదరాబాద్: ప్రజా కవి, రచయిత అందెశ్రీ అంత్యక్రియలు ముగిశాయి. ఘట్‌కేసర్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అందెశ్రీ అంత్యక్రియలు నిర్వహించారు. అందెశ్రీ అంత్యక్రియలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అందెశ్రీ కుటుంబసభ్యులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓదార్చారు. అనంతరం రేవంత్ రెడ్డి అందెశ్రీ పాడెమోశారు. ప్రజాకవి అంత్యక్రియలకు ప్రజలు భారీగా తరలివచ్చారు.