calender_icon.png 4 December, 2025 | 2:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళా కళాశాలలో సైబర్ సెక్యూరిటీపై అవగాహన సదస్సు

04-12-2025 01:48:38 AM

హనుమకొండ టౌన్, డిసెంబర్ 3 (విజయక్రాంతి): హనుమకొండ వడ్డేపల్లి పింగిళి ప్రభుత్వ మహిళా కళాశాల (అటానమస్) లో సైబర్ జాగరూకత దివస్ సందర్భంగా సైబర్ సెక్యూరిటీ గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపల్ లెఫ్టినెంట్ ప్రొఫెసర్ బి. చంద్రమౌళి తెలిపారు. ఈ కార్యక్రమానికి హన్మకొండ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏ.సి.పి.) పి. నరసింహ రావు ముఖ్య అతిధి గా విచ్చేసి విద్యార్థినులకు వివిధ రకాల సైబర్ నేరాలను ఉదహరిస్తూ సెక్యూరిటీ అప్రమత్తత పై చాలా విలువైన సూచనలు చేయడం జరిగింది.

ఈ కార్యక్రమం లో సుబేదారి సర్కిల్ ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్, సబ్ ఇన్స్పెక్టర్ లు టి. మహేందర్ రెడ్డి, టి. సుమన్, డి.వి.ఫణి, కృష్ణవేణి లు పాల్గొని విద్యార్థినులకు రోజువారి జీవితంలో సైబర్ నేరస్థుల వలలో చిక్కుకోకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, అనుకోని సంఘటనలు సంభవి స్తే పోలీస్ అధికారులను ఎలా సంప్రదించాలి, సైబర్ సెక్యూరిటీ హెల్ప్ లైన్ ఎలా వినియోగించుకోవాలి మొదలైన విషయాలపై విలువైన సమాచారం అందించారు.

కళాశాల ప్రిన్సిపల్ లెఫ్టి నెంట్ ప్రొఫెసర్ బి. చంద్రమౌళి మాట్లాడుతూ పింగిళి కళాశాల విద్యార్థినులు సైబర్ సెక్యూరిటీ కి సంబంధించిన జాగ్రత్తలు తాము తీసుకుంటూ సామాజిక బాధ్యతగా తమ కుటుంబ సభ్యులకు, చుట్టుపక్కల ప్రజలకు కూడా అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కా ర్యక్రమం లో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డా. సుహాసిని ఎన్సిసి కేర్ టేకర్ ఆఫీసర్ డా. సువర్ణ, కళాశాల అధ్యాపక బృందం, ఎన్సిసి క్యాడెట్స్, విద్యార్థినులు పాల్గొన్నారు.