calender_icon.png 4 December, 2025 | 2:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దత్త నవరాత్రుల్లో మంత్రి శ్రీధర్‌బాబు పూజలు

04-12-2025 01:49:46 AM

కాటారం, డిసెంబర్ 3 (విజయక్రాంతి) : దత్తాత్రేయ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా కాటారం మండలం ధన్వాడ గ్రామంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రత్యేక పూజలు నిర్వహించా రు. బుధవారం ఆయన స్వగ్రామమైన ధన్వాడలో గల దత్తాత్రేయ స్వామి ఆలయంలో దత్త నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సుదర్శన యాగం లో పాల్గొన్నారు. అంతకుముందు ఆయన సహోదరుడు రా ష్ట్ర పిసిసి కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు దత్త నవరాత్రులలో పాల్గొన్నారు.

వారి తండ్రి పూర్వ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్, స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు కుటుంబ దైవమైన దత్త దేవాలయంలో ఏటా కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మంథని నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దత్త ఆలయం అర్చకులు శ్రీ రాంబట్ల కృష్ణమోహన్ శర్మ , సుమిత్ శర్మ, తిరుమల తిరుపతి వేద పండితులు ఒజ్జల గణేష్ శాస్త్రి అవధాని, ప్రవీణ్ శర్మ వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులుపాల్గొన్నారు.