calender_icon.png 28 January, 2026 | 7:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు హెల్ప్ లైన్ ఏర్పాటు

28-01-2026 04:22:40 PM

జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్,(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి, ఫిర్యాదుల స్వీకరణ కొరకు జిల్లాలో హెల్ప్ లైన్ ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. 9100577132 నంబరును సంప్రదించడం ద్వారా మున్సిపల్ ఎన్నికలపై ఏవైనా సమస్యలు ఉంటే ఫిర్యాదు చేయవచ్చునని అన్నారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో పారదర్శకత కొరకు హెల్ప్ లైన్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఎన్నికలకు సంబంధించిన ఏ వివరాలు కావాలన్నా ఈ హెల్ప్ లైన్ సెంటర్లో పొందవచ్చు అని తెలిపారు