calender_icon.png 9 May, 2025 | 11:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్‌ఆర్‌ఎస్ రాయితీపై అవగాహన కల్పించాలి

19-03-2025 02:07:19 AM

జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే 

కుమ్రం భీం ఆసిఫాబాద్,మార్చి 18(విజయ క్రాంతి): ఎల్.ఆర్.ఎస్. -2020 పథకంలో రాయితీపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. మంగళవారం ఆసిఫాబాద్ మండలం బురుగూడ గ్రామపంచాయతీ కార్యాలయంలో డివిజనల్ పంచాయతీ అధికారి ఉమర్ తో కలిసి గ్రామపంచాయతీ పరిధిలోని ఎల్.ఆర్.ఎస్. దరఖాస్తుల వివరాలపై సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎల్.ఆర్.ఎస్. దరఖాస్తులు చేసుకొని క్రమబద్దీకరణ కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం మంచి అవకాశాన్ని కల్పించిందని, 25 శాతం రాయితీని దరఖాస్తుదారులు వినియోగించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. నూతన ఇంటి నిర్మాణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తప్పనిసరిగా ఎల్.ఆర్.ఎస్. చెల్లించవలసి ఉంటుందని, తద్వారా బ్యాంకు రుణ సౌకర్యం పొందవచ్చని తెలిపారు.

గ్రామపంచాయతీ పరిధిలో 78 మంది దరఖాస్తుదారులకు గాను 3 మంది మాత్రమే ఆన్ లైన్ ద్వారా చెల్లించారని, ఈనెల 31వ తేదీలోగా రాయితీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అభ్యర్థులు చెల్లించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు.అనంతరం గ్రామపంచాయతీ పరిధిలోని నర్సరీని సందర్శించి మొక్కల నిర్వహణను పరిశీలించారు.

మొక్కల పెంపకంలో అలసత్వం వహిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని, విత్తన అభివృద్ధి, మొక్కల పెంపకం అంశాలలో శ్రద్ధ వహించాలని అధికారులకు సూచించారు. మొక్కల పెంపకంపై అలసత్వం వహిస్తే సంబంధిత అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి మౌనిక, ఈ.జి.ఎస్. ఎ.పి.ఎం. చంద్రశేఖర్, పంచాయతీ కార్యదర్శి శ్రీలత సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.