17-08-2025 08:20:15 PM
జాతీయ మానవ హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సగ్గు వేణుమాధవ్
ఘట్ కేసర్: సమాచార హక్కు చట్టం వినియోగం గురించి గ్రామీణ స్థాయి నుండి అవగాహన కల్పించి ప్రజలను చైతన్యం చేయా ల్సిన అవసరం ఉన్నదని జాతీయ మానవ హక్కుల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సగ్గు వేణుమాధవ్ అన్నారు. ఘట్ కేసర్ పట్టణ కేంద్రంలోని సంఘం జిల్లా కార్యాలయంలో ఆయన ఆదివారం మాట్లాడుతూ అవినీతి, అక్రమ నిర్మూలనకు సమాచార హక్కుచట్టం బ్రహ్మస్త్రం లాంటిదన్నారు. ఎస్జీఓల కృషి ఫలితంగా మన రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చిందని అయితే ఆ చట్టంపై అవగాహన కల్పించి పటిష్టంగా అమలు పరచడంలో ప్రభుత్వం వైఫల్యం చెందుతుందన్నారు. సమాచార హక్కు చట్టం వినియోగం ఫలితాల గురించి ప్రజలకు వివరించి గ్రామీణ స్థాయి నుండి ప్రజలలో చైతన్యం కల్గించాల్సిన అవసరం ఉందన్నారు. నిరక్షరాస్యత కూడా సమాచార హక్కుపై అవగాహన లేకపోవడానికి ప్రధాన కారణమన్నారు.
ప్రభుత్వ కార్యాలయంలో, సంస్థలలో అవినీతి నిర్మూలన, నిధుల వినియోగం గురించిన సమాచారం తెలుకోవడం, నిర్మూలించడానికి సమాచార హక్కు బ్రహ్మస్త్రం లాంటిదన్నారు. సమాచార హక్కు చట్టం అమలు తీరుపై కూడా జాతీయ మానవ హక్కుల సంగం దృష్టి సారించి, చట్టం సక్రమంగా అమలు జరిగే విధంగా చూస్తుందని జాతీయ మానవ హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సగ్గు వేణుమాధవ్ పేర్కొన్నారు.