calender_icon.png 17 August, 2025 | 9:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిబంధనలు విరుద్ధంగా డీజేలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తప్పవు

17-08-2025 07:51:16 PM

గణేష్ మండపాల వద్ద పోలీస్ శాఖ అనుమతితో చిన్న స్పీకర్లు మాత్రమే ఏర్పాటు చేసుకోవాలి

వేములవాడ పట్టణ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్

వేములవాడ టౌన్,(విజయక్రాంతి): పోలీస్ స్టేషన్లో పట్టణ పరిధిలోని డిజే యజమనులతో సమావేశం నిర్వహించి డిజే యజమానులు పోలీస్ సూచనలు బేఖాతరు చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా డి.జే నిర్వహించినట్లు అయితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీఐ  మాట్లాడుతూ... నిబంధనలకు విరుద్ధంగా డిజే లు నిర్వహించిన, యాంప్లిఫైయర్ తో బాక్స్ లు ఏర్పాటు చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని, గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో మండపాల వద్ద కానీ, శోభయత్రలో కానీ డీజేలు కానీ యాంప్లిఫైయర్ తో బాక్స్ లు ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బంది కలిగించిన డి.జే యజమానులతో పాటుగా నిర్వహకులపై కఠినచర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

గణేష్ మండపాల వద్ద పోలీస్ అధికారుల అనుమతితో చిన్న స్పీకర్లు మాత్రమే ఏర్పాటు చేసుకోవాలని అదికూడా రాత్రి పది గంటల వరకు మాత్రమే అని,అధిక శబ్దాలు చేసే డి.జే ల వలన చిన్న పిల్లలు,విద్యార్థుల చదువుకు,వృద్ధులు ఆరోగ్యనికి ఇబ్బంది పడుతున్న నేపధ్యంలో డి.జే నిర్వహకులపై డయల్ వంద కాల్స్ వస్తున్నాయని వేములవాడ పట్టణ పరిధిలో ఎట్టి పరిస్థితుల్లో డి.జే లకు అనుమతి లేదు అని స్పష్టం చేశారు.