calender_icon.png 17 August, 2025 | 9:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు నష్టపరిహారం చెల్లించాలి

17-08-2025 08:31:01 PM

బీజెపి మాజీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి

లక్షేట్టిపేట,(విజయక్రాంతి): కొమ్ముగూడెం చెరువుకు గండి పడి 200 ఎకరాల పంట పొలాలు నీట మునిగిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం కొమ్ముగూడెం గ్రామాన్ని సందర్శించి నీట మునిగిన పంటలను, చెరువును పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వ నిర్లక్ష్యం వలన చెరువు క్రింద ఉన్న బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాకపోవడంతో ప్రతి ఏడాది రైతులు వరద వలన తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలలో బ్రిడ్జి నిర్మాణం చేపట్టకుండా కాలయాపన చేస్తే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నర పాలనలో బ్రిడ్జి కోసం శంకుస్థాపన చేసి వదిలేశారని విమర్శించారు. నీట మునిగిన పంటలకు ఎకరానికి 25000/- రూ. నష్టపరిహారం చెల్లించాలని రఘునాథ్ గారు డిమాండ్ చేశారు.