17-08-2025 08:38:10 PM
వేములవాడ టౌన్,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూలర్ మండలంలోని నూకలమర్రి గ్రామ కబడ్డి క్రీడాకారుడు చందనం ప్రశాంత్ తెలంగాణ యువ ప్రో కబడ్డీ జట్టు లో స్థానం దక్కించుకునందుకు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ప్రశాంత్ గతములో జాతీయ స్థాయిలో కబడ్డిలో పాల్గొని మా గ్రామానికి పేరు తేవడం జరిగింది. ఇపుడు ఆగస్టు నెలలో 24నుండి ప్రారంభం కానున్న తెలంగాణ యువ ప్రో కబడ్డీ జట్టు లో స్థానం దక్కించుకునందుకు ప్రశాంత్ ను జిల్లా యువజన సంఘాల అధ్యక్షుడు సోమునేని బాలు. అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ప్రపంచ స్థాయిలో కబడ్డి లో పాల్గొని మా గ్రామానికి పేరు తేవాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా గ్రామ ప్రజలు.