calender_icon.png 17 August, 2025 | 9:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

17-08-2025 07:55:01 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో సహాయక చర్యలను ముమ్మరం చేసినందుకు కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ప్రజలు ఏ సాయం కావాలన్నా 9100577132 నంబర్లు సంప్రదించాలని సూచించారు. అలాగే పాడుబడ్డ ఇళ్లలో ఉండవద్దని ప్రవహిస్తున్న వాగులు దాటవద్దని ప్రాజెక్టులు కింద నది పరివాహ ప్రాంతాల్లో ప్రజలు చేపలు పట్టే కార్మికులు పశువుల కాపరులు వెళ్ళవద్దని సూచించారు. ప్రజలకు ఏ అవసరం ఉన్నా అధికారులను సంప్రదించాలని కోరారు.