calender_icon.png 17 August, 2025 | 9:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొల్కపురి శ్రీకాంత్ గౌడ్ సర్దార్ సర్వాయి పాపన్న కన్వీనర్ గా నియామకం

17-08-2025 08:02:10 PM

నాగారం: సూర్యాపేట జిల్లా నాగారం మండల పరిధిలోని మామిడిపల్లి గ్రామానికి చెందిన తెలంగాణ గౌడ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొల్కపురి శ్రీకాంత్ గౌడ్ కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని అందించింది. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి ఉత్సవ కమిటి కన్వీనర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ  చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నాకు ఇచ్చిన ఈ అరుదైన గౌరవాన్ని ఒక బాధ్యతగా స్వీకరించి సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా దిగ్విజయంగా పూర్తి చేస్తానని తెలిపారు. తన ఎన్నికక సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.