calender_icon.png 24 May, 2025 | 5:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆయుష్మాన్ భారత్‌ను అమలు చేయాలి

12-05-2025 12:00:00 AM

ఎమ్మెల్యే పాయల్ శంకర్

ఆదిలాబాద్, మే 11 (విజయ క్రాంతి) : పేద ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో వెళ్ళినప్పుడు పూర్తిస్థాయిలో వైద్యం ఖర్చులు ప్రభుత్వమే భరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మె ల్యే పాయల్ శంకర్ అన్నారు. అదిలాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో సీఎంఆర్‌ఎఫ్ లబ్ధిదారులకు ఆదివారం చెక్కులను అందజేశారు. ఆయు ష్మాన్ భారత్‌ను రాష్ట్రంలో పకడ్బందీగా అమలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

సీఎంఆర్‌ఎఫ్ పరిమితిని పెంచాలని సూచిం చారు. ఈ విషయంపై అసెంబ్లీలో ప్రస్తావిస్తానని పేర్కొన్నారు. ప్రతి ఒక్క రు ముందు జాగ్రత్తగా ఇన్సూరెన్స్ చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు తదితరులు ఉన్నారు.