11-05-2025 11:54:36 PM
పటాన్ చెరు, మే 11 : పటాన్ చెరు మండ లం ఘనపూర్ లో ఆదివారం భ్రమరాంబ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాలు ఘ నంగా జరిగాయి. జాతర ఉత్సవాలకు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి కాట శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, ప్రజలతో కలిసి భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ అమ్మవారి దయతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. అనంతరం జాతర నిర్వాహకులు ఆలయ కమిటీ సభ్యులు కాట శ్రీనివాస్ గౌడ్ ను ఘనంగా సన్మానించారు.