calender_icon.png 5 December, 2025 | 10:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అయ్యప్ప స్వాముల ఆందోళన

05-12-2025 09:05:44 AM

హైదరాబాద్: దేశవ్యాప్తంగా విమాన సర్వీసుల్లో అంతరాయం(Disruption to flight services) ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. శుక్రవారం ఉదయం శంషాబాద్‌ విమానాశ్రయంలో(Shamshabad airport) అయ్యప్ప స్వాముల ఆందోళనకు(Ayyappa devotees) దిగారు. హైదరాబాద్‌ నుంచి కొచ్చి వెళ్లాల్సిన విమానం 12 గంటలు ఆలస్యం అయింది. ఇండిగో విమానం గురువారం సాయంత్రం హైదరాబాద్‌ నుంచి కొచ్చి(Hyderabad to Kochi flight) వెళ్లాల్సిఉంది. ఇప్పటికీ బయల్దేరక పోవడంతో అయ్యప్ప స్వాములు(Ayyappa Swamulu) ఆందోళనకు దిగారు.

బోర్డింగ్‌ గేటుకు అడ్డంగా బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో(Rajiv Gandhi International Airport) గురువారం వరుసగా రెండో రోజు గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇండిగో 37 అవుట్‌బౌండ్ విమానాలను రద్దు చేసింది. విమానాలను నడపడానికి సిబ్బంది కొరతతో  దేశీయ విమానయాన సంస్థ ఇండిగో గురువారం మూడు ప్రధాన విమానాశ్రయాల నుండి 180 కి పైగా విమానాలను రద్దు చేసింది. దీంతో ముంబై, ఢిల్లీ, బెంగళూరు విమానాశ్రయాలలో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.