calender_icon.png 5 December, 2025 | 9:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పుతిన్‌కు అధికారిక స్వాగతం

05-12-2025 08:31:27 AM

న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Russian President Vladimir Putin) భారత్‌లో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి భవనంలో పుతిన్ కు అధికారిక స్వాగతం లభిస్తోంది. నేడు 23వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పుతిన్ పాల్గొననున్నారు. ప్రధాని మోదీతో పుతిన్ ద్వైపాక్షిక చర్యలు జరపనున్నారు. భారత్-రష్యా మధ్య అణువిద్యుత్ సహా పలు రంగాల్లో కీలక ఒప్పందాలు జరగనున్నాయి. ఇరు దేశాల మధ్య ప్యూహాత్మక రక్షణ, వాణిజ్య ఒప్పందాలు జరిగే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి.