05-12-2025 02:02:14 AM
రంగారెడ్డి, డిసెంబర్ 4 (విజయక్రాంతి ): పంచాయతీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు కనిపిస్తున్నాయి. అవసరం ఉంటే కానీ పల్లెతు మాట పలకరించని పాపానా పోని వాళ్లంతా.. ఇప్పుడు చుట్టారి కాలు కలుపుతున్నారు. అక్క,అన్నా తమ్ముడు, చెల్లె, అవ్వ, తాత, అంటూ ఆప్యాయత పలకరింపులు. అభ్యర్థుల ఓట్ల వేటలో ప్రదర్శిస్తున్న దసరా వేషాలను చూసి కొందరు ఇదెక్కడి చోద్యం అని.. నోరెళ్ళ బెడుతుంటే.. ఇది.. ఎలక్షన్స్ సీజన్ కదా.. ఓట్లు ఐపోయే వరకు ఇలాగనే ఉంటుదంటూ మరికొందరురూ చమత్కారాలు విసురుతున్నారు.
తప్పదు మరి.. లక్షలు కుమ్మరించి సర్పంచ్ ఎన్నికల్లో నిలబడుతుంటే.. ఓటరు దేవుళ్ళకు మర్యాద ఇవ్వాల్సిందే.. వారు మద్దతు తెలిపితేనే అభ్యర్థులు సీటు గద్దెనక్కేది ఉంటుంది. ఎన్నికల వరకు అభ్యర్థులకు ఈ సర్కస్ పీట్లు తప్పదు మరి.లెక్కలు కడుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రతీ ఓటు కీలకం. దీంతో ఓటర్ జాబితాను పట్టుకొని వార్డులవారిగా ఓట్లను లెక్కిస్తున్నారు. వార్డుల వారిగా తమకు అనుకూలంగా ఉండే ఓట్లు ఎన్ని.. న్యూట్రల్ గా ఉండే ఓట్లు ఎన్ని.. ఎవరిని రంగంలోకి దింపితే తమకు ఓట్లు పడతాయి ఎత్తు గడలు వేస్తు వాటిని అమలు పరుస్తున్నారు.
వలస ఓట్లపై ఫోకస్..
తమ పంచాయతీ, తండల నుంచి బతుకుదెరువు, ఉద్యోగాల వేట కోసం వెళ్లిన వారి వివరాలను సేకరిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులు బంధువుల ద్వారా.. వారిని ఆశ్రయిస్తూ తమకు మద్దతు తెలిపేలా కోరుతున్నారు. ఎన్ని ఎన్నికల రోజు ఓటు వేసేందుకు వస్తే అన్ని మంచి చెడ్డ చూసుకుంటామంటూ హామీలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా పల్లెల్లో ఆమ్లెట్ తండా లో ఉన్న వారంతా మెజార్టీగా ఉపాధి నిమిత్తం హైదరాబాదుకు వలస వెళ్లారు.
తమ పత్యార్థి కన్నా ముందే వారి వద్దకు తమ మద్దతుదారులు లేదా అభ్యర్థి వెళ్లి... తమకు మద్దతు తెలిపితే నీకు అన్ని విధాలుగా అండగా ఉంటామంటూ హామీల వర్షం గుప్పిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు మొదలుకొని పంచాయతీ ఎన్నికల్లో వలస ఓటర్లే కీలకం. అందుకే ప్రతి అభ్యర్థి వారి పైన ప్రధాన దృష్టి సారించారు.
డిజిటల్ చెల్లింపులు..
ఒకప్పుడు ఎన్నికలు ఖర్చు చేయాలంటే.. పైసలు తరలించాలంటే నానా అగచాట్లు పడేవారు అభ్యర్థులంతా. కాలం మారింది.. ప్రచార శైలి మారింది.. ప్రస్తుతం డిజిటల్ యుగం నడుస్తుంది. దానికి అనుగుణంగానే అభ్యర్థులంతా అప్డేట్ అయ్యారు. క్షణాలలో తమకు మద్దతు తెలిపే వారికి వారు తెలిపే కోరికల చిట్టాలకు సై అంటూ డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారు. అభ్యర్థులు ఎన్నికల ఖర్చుల కోసం ఖర్చు చేసే ప్రతి ప్రైస్ ఆ వారి అకౌంట్లో ద్వారా వెళ్ళితే.. ఎన్నికల వ్య యా పరిశీలకులకు దొరికే అవకాశం ఉండడంతో.. కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు.
ఎన్నికల నిబంధనల ప్రకారం..
తాము ఖర్చు చేసే ప్రతి రూపాయి కి గెలిచిన తర్వాత లెక్కలు చూపించాల్సి ఉంటుంది.. దీంతో ఎన్నికల్లో ఖర్చు చేసే డబ్బు వేరే మార్గాల ద్వారా మళ్ళీ స్తున్నారు. ఓటర్లకు ప్రధానంగా తమ అనుచర్లు, బంధువులు, పార్టీ నేతలు, కార్యకర్తలు ద్వారా డిజిటల్ చెల్లింపులు చెల్లిస్తున్నారు. కొన్ని పంచాయతీల్లో అధికార ప్రతిపక్ష పార్టీల మద్దతుతో బరిలో నిలవడం తో ఎవరికి మద్దతు ఇవ్వాలో ఎటు తెలుచుకోలేక అయోమయంలో పడ్డారు. మరో పక్క ఉదయం ప్రచారం చేస్తూ.. రాత్రిపూట అభ్యర్థులు ఓటర్లకు సుక్క.. ముక్క ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. ప్రతిరోజు వాళ్ళ వార్డుల వారిగా ప్రత్యేకంగా ఇందుకోసం కొందరిని కేటాయించి.. ఓటర్లకు మంచి చెడ్డ చూసుకుంటున్నారు.